బాహుబలి టీంకి సహకరించిన ప్రకృతి

బాహుబలి టీంకి సహకరించిన ప్రకృతి

Published on Dec 2, 2013 6:17 PM IST

Mother-nature-blesses-Baahu
తెలుగు ఫిల్మ్ ఇండస్ట్రీ మొత్తం ఎంతగానో ఎదురు చూస్తున్న పీరియాడికల్ డ్రామా ‘బాహుబలి’. ప్రస్తుతం ఈ సినిమా షూటింగ్ కేరళలో జరుగుతోంది. ఎస్ఎస్ రాజమౌళి డైరెక్ట్ చేస్తున్న ఈ సినిమాలో ప్రభాస్ హీరోగా కనిపించనున్నాడు. ఈ రోజు ఈ సినిమా సెట్స్ లో ఓ ఆసక్తికరమైన విషయం చోటు చేసుకుంది.

ఈ చిత్ర ప్రొడక్షన్ టీం ఈ రోజు ఓ వాటర్ ఫాల్స్ వద్ద కొన్ని సీన్స్ తీయడానికి వెళ్ళారు. ఈ రోజు ఉదయం అక్కడ వాటర్ ఫ్లో బాగా అతక్కువగా ఆంది. దాంతో ఈ చిత్ర టీం ఎక్కువ వాటర్ ఫ్లో కావాలని ప్రార్ధించారు. వారి కోరిక మేరకు ప్రకృతి కరుణించింది. చాలా తక్కువ టైంలోనే ఆ వాటర్ ఫాల్స్ దగ్గర వాటర్ ఫ్లో బాగా పెరిగింది.

మేము మీకు పైన అందించిన ఫోటోని బాహుబలి టీం ఫేస్ బుక్ పేజిలో పోస్ట్ చేసారు. ఈ ఫోటో ఎడమ వైపున బాగా తక్కువ ఫ్లో ఉన్న వాటర్ ఫాల్స్ ని మనం చూడొచ్చు. అలాగే కుడివైపు ఫ్లో బాగా ఎక్కువగా ఉన్న వాటర్ ఫాల్స్ ని చూడొచ్చు. ఆర్కా మీడియా బ్యానర్ వారు అత్యంత భారీ బడ్జెట్ తో ఎంతో ప్రతిష్టాత్మకంగా నిర్మిస్తున్న ఈ సినిమాకి ఎంఎం కీరవాణి సంగీతం అందిస్తుండగా సెంథిల్ కుమార్ సినిమాటోగ్రాఫర్ గా పనిచేస్తున్నాడు.

తాజా వార్తలు