ఇప్పుడు సూపర్ స్టార్ మహేష్ బాబు హీరోగా హిట్ దర్శకుడు పరశురాం తో “సర్కారు వారి పాట” అనే ఓ అదిరిపోయే సబ్జెక్ట్ లో నటిస్తున్న సంగతి తెలిసిందే. అలాగే మరోపక్క మహేష్ హ్యాట్రిక్ బ్లాక్ బస్టర్స్ తర్వాత చేపట్టిన సినిమా కావడంతో దీనిపైన మరిన్ని అంచనాలు నెలకొన్నాయి.
అయితే మహేష్ చేపట్టిన ఈ ప్రాజెక్ట్ విషయంలో కాస్త గందరగోళం నెలకొన్న సంగతి తెలిసిందే. ఓ దర్శకుడు చేయాల్సింది కాస్త మరో దర్శకుని చెంతకు వచ్చింది. మరి ఆ దర్శకుడు తోనే మహేష్ నెక్స్ట్ దాదాపు ఖరారే అన్న సూచనలే కనిపిస్తున్నాయి.
ఇటీవల కాలంలో మహేష్ కాంపౌండ్ లోనే దర్శకుడు వంశీ పైడిపల్లి కనిపిస్తుండడం పలు ఆసక్తి కర ప్రశ్నలకు తావిస్తోంది. దీనితో ఇక మహేష్ నెక్స్ట్ కు వంశీనే ఫైనల్ అన్నట్టు అనుకోవచ్చని చెప్పొచ్చు. మరి వీరి కాంబోలో వచ్చిన “మహర్షి” మహేష్ కు స్పెషల్ గా నిలిచింది. సో ఈ కాంబో మళ్లీ రిపీట్ అయ్యేది వెంటనేనా కాదా అన్నది కాలమే నిర్ణయించాలి.