ప్రస్తుతం పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ నటిస్తున్న రీమేక్ చిత్రం “వకీల్ సాబ్”. చాలా కాలం అనంతరం పవన్ నుంచి వస్తున్న కం బ్యాక్ చిత్రం కావడంతో ఈ చిత్రంపై భారీ అంచనాలు కూడా నెలకొన్నాయి. కానీ విడుదల విషయంలో మాత్రం లాక్ డౌన్ వల్ల చాలానే దూరం ఈ చిత్రం వెళ్ళిపోయింది. ఇంకా అలాగే ఈ సినిమా నుంచి కూడా ఇంత పెద్ద గ్యాప్ లో పెద్ద చెప్పుకోదగ్గ అప్డేట్స్ కూడా వచ్చింది లేదు.
ఆ మధ్య పవన్ పుట్టినరోజు సందర్భంగా మోషన్ పోస్టర్ టీజర్ తో అభిమానులకు అప్పటికి చిన్నగా ట్రీట్ ఇచ్చేసారు. కానీ ఎన్నో స్పెషల్ డేస్ వస్తున్నాయి కానీ ఎప్పటి నుంచి ఎదురు చూస్తున్న సాలిడ్ అప్డేట్స్ మాత్రం రావడం లేదు. దీనితో అంతా వచ్చే కొత్త సంవత్సరానికే టార్గెట్ పెట్టుకున్నారు. మరి ఈ సమయానికి గానూ కొన్ని గాసిప్స్ వినిపిస్తున్నాయి.
ఇది వరకే న్యూయర్ కానుకగా టీజర్ వచ్చే అవకాశం ఉందని టాక్ వచ్చింది. కానీ లేటెస్ట్ గా సెకండ్ సింగిల్ పై కూడా సిగ్నల్స్ వస్తున్నాయి. మరి మేకర్స్ నుంచి ఈసారి అయినా సరైన అప్డేట్ వస్తుందా లేదా అన్నది చూడాలి. ఇక ఈ చిత్రానికి గాను శ్రీరామ్ వేణు దర్శకత్వం వహిస్తుండగా థమన్ సంగీతం అందించాడు. అలాగే దిల్ రాజు నిర్మాణం వహిస్తున్నారు. అలాగే శృతి హాసన్ ఈ చిత్రంలో హీరోయిన్ గా నటిస్తుండగా నివేతా థామస్ మరియు అంజలిలు కీలక పాత్రల్లో నటిస్తున్నారు.