“వకీల్ సాబ్” రిలీజ్ పై మరిన్ని గాసిప్స్.!

“వకీల్ సాబ్” రిలీజ్ పై మరిన్ని గాసిప్స్.!

Published on Nov 17, 2020 12:00 PM IST

ప్రస్తుతం పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ నటిస్తున్న చిత్రాల్లో దర్శకుడు శ్రీరామ్ వేణుతో చేస్తున్న చిత్రం “వకీల్ సాబ్” కూడా ఒకటి. బాలీవుడ్ హిట్ చిత్రం పింక్ కు రీమేక్ గా తెరకెక్కిస్తున్న ఈ చిత్రం అనే కాకుండా పవన్ నుంచి వస్తున్న కం బ్యాక్ చిత్రం కావడంతో దీనిపై భారీ అంచనాలు పెట్టుకున్నారు. కానీ ఈ సినిమా నుంచి మాత్రం సరైన అప్డేట్స్ లేకపోవడంతో పవన్ అభిమానులు గత కొంత కాలం నుంచి కాస్త నిరాశ లోనే ఉన్నారు. ఇక ఇదిలా ఉండగా ఈ చిత్రం విడుదల పట్ల కూడా పలు గాసిప్స్ ఇప్పుడు వినిపిస్తున్నాయి.

ఎలాగో టీజర్ అండ్ మిగతా అప్డేట్స్ ను స్కిప్ చేసేసిన చిత్ర యూనిట్ విడుదల కూడా పరిస్థితులు చక్కబడ్డాకే విడుదల చెయ్యాలనే యోచనలో ఉన్నట్టు టాక్ వినిపిస్తుంది. అందుకే ఈ చిత్రాన్ని మెల్లగా వేసవి రేస్ లో ఉంచాలని గాసిప్స్ వినిపిస్తున్నాయి. మరి ఇందులో ఎంత వరకు నిజముందో కానీ అధికారిక సమాచారం వచ్చే వరకు ఆగక తప్పదు. ఈ చిత్రానికి థమన్ సంగీతం అందిస్తుండగా దిల్ రాజు నిర్మాణం వహిస్తున్నారు. అలాగే ఈ చిత్రంలో నివేతా థామస్ అలాగే అంజలిలు కీలక పాత్రల్లో కనిపిస్తున్నారు.

తాజా వార్తలు