“అల్లుడు అదుర్స్” లో మోనాల్ స్పెషల్ సాంగ్.!

“అల్లుడు అదుర్స్” లో మోనాల్ స్పెషల్ సాంగ్.!

Published on Dec 29, 2020 2:30 PM IST

మన తెలుగు బిగ్ బాస్ సీజన్ 4 విన్నర్ మరియు రన్నర్ లు సినీ ఇండస్ట్రీలో ఎంత బిజీగా ఉన్నారో కానీ వారి తర్వాత స్థానాల్లో ఉన్న వారికి మాత్రం ఒకదాన్ని మించిన అవకాశాలు మరొకటి వస్తున్నాయి. లేటెస్ట్ గా బిగ్ బాస్ సెన్సేషనల్ ఫీమేల్ కంటెస్టెంట్ మోనాల్ గజ్జర్ మన టాలీవుడ్ యంగ్ అండ్ టాలెంటెడ్ హీరో అయినటువంటి బెల్లంకొండ సాయి శ్రీనివాస్ హీరోగా నటిస్తున్న లేటెస్ట్ చిత్రం “అల్లుడు అదుర్స్”లో ఓ క్రేజీ సాంగ్ కు ఓకే చెప్పి హాట్ టాపిక్ గా నిలిచింది.

వచ్చే సంక్రాంతికి ప్లాన్ చేస్తున్న ఈ చిత్రానికి సంతోష్ శ్రీనివాస్ దర్శకత్వం వహిస్తున్నారు. ఇక అలాగే ఈ క్రేజీ సాంగ్ షూట్ ఇప్పుడు శరవేగంగా జరుగుతుంది. అలాగే దేవిశ్రీ ప్రసాద్ సంగీతం అందిస్తున్న ఈ సాంగ్ మంచి అట్రాక్షన్ గా నిలుస్తుంది అని తెలుస్తుంది. ఇప్పటికే అల్లుడు శీను సినిమాతో మంచి బీట్స్ దేవీ శ్రీనివాస్ కు ఇచ్చాడు. అలాగే రాక్షసుడు తో మంచి హిట్ ఇచ్చిన డైరెక్టర్ కావడం లేటెస్ట్ గా రేస్ లోకి వచ్చినా మంచి బజ్ సంతరించుకుంది. ఇక ఈ చిత్రం వచ్చే జనవరి 15న విడుదలకు రెడీ అవుతుంది.

తాజా వార్తలు