మళయాళ సినిమా సీనియర్ స్టార్ హీరోస్ లో ఒకరైన మోహన్ లాల్ ఆ మధ్య వరుస డిజప్పాయింట్మెంట్ సినిమాలు తర్వాత ఇప్పుడు వరుస బ్లాక్ బస్టర్ హిట్స్ ని కొట్టి తానేంటో ప్రూవ్ చేశారు. ఇలా ఒక్క నెల వ్యవధిలో రెండు భారీ హిట్స్ అందుకున్న మోహన్ లాల్ నుంచి వచ్చిన రెండో హిట్ సినిమానే “తుడరుమ్”.
మళయాళంలో భారీ వసూళ్లు అందుకున్న ఈ సినిమా ఫైనల్ గా ఓటీటీలో స్ట్రీమింగ్ కి వచ్చేసింది. మరి ఈ సినిమా హక్కులు జియో హాట్ స్టార్ సొంతం చేసుకున్న విషయం తెలిసిందే. ఇక ఇందులో నేటి నుంచి ఈ చిత్రం పాన్ ఇండియా భాషల్లో వచ్చేసింది. సో ఈ సినిమాని చూడాలి అనుకుంటే హాట్ స్టార్ లో ట్రై చేయవచ్చు.