రామోజీ గ్రూప్స్ అధినేత రామోజీ రావు చిన్న కుమారుడు సుమన్ నిన్న రాత్రి కన్నుమూశారు. ఒక్క సారిగా దిగ్బ్రాంతికి గురైన రామోజీ కుటుంబానికి పలువురు ప్రముఖులు తమ సంతాపాన్ని తెలియజేసారు. చాలా మంది సినీ ప్రముఖులు రామోజీ ఫిల్మ్ సిటీలో సుమన్ కి కలిసి నివాళులు అర్పించారు.
డా. మోహన్ బాబు మరియు పవన్ కళ్యాణ్ రామోజీ రావు మరియు వారి కుటుంబానికి సంతాపాన్ని తెలియజేసారు. వారు ఏమన్నారో వారి మాటల్లోనే చూద్దాం..
డా. మోహన్ బాబు :
‘సుమన్ అకాల మరణం నా మనసును ఎంతగానో బాధ పెట్టింది. వ్యక్తిగా, టీవిలో మంచి నటుడుగా ఎంతో పేరుతెచ్చుకున్నాడు. నాకు చాల ఆత్మీయుడు. రామోజీరావు గారి కుటుంబంతో నాకు చాల అనుబంధం వుంది. సుమన్ ఆత్మకు శాంతి చేకూరాలని ఆ భగవంతున్ని కోరుకుంటూ వారి కుటుంభ సభ్యులకు సానుభూతి తెలియజేస్తున్నాను’ అని మోహన్ బాబు అన్నారు.
పవన్ కళ్యాణ్ :
‘సుమన్ ఇకలేరు అనే విషయాన్ని విని ఎంతో బాధకి లోనయ్యాను. మల్టీ టాలెంట్ ఉన్న వ్యక్తి సుమన్ మరియు తెలుగు టెలివిజన్ రంగాన్ని అభివృద్ధి చేయాలని ఎంతో తాపత్రయం ఉన్న వ్యక్తి. అలాగే సుమన్ కి భారతీయ పురాణాలు అంటే చాలా ఇష్టం. అలాంటి వ్యక్తి ఇకల్రు అనేది జీర్ణించుకోలేని విషయం. రామోజీరావు గారికి మరియు కుటుంబ సబ్యులకు నా తీవ్ర సంతాపాన్ని తెలియజేస్తున్నానని’ పవన్ అన్నారు.