ప్రస్తుతం కలెక్షన్ కింగ్ డా. మోహన్ బాబు నటిస్తున్న సినిమా షూటింగ్ యూరప్ లో జరుగుతోంది. మల్టీ స్టారర్ గా తెరకెక్కుతున్న ఈ సినిమాలో విష్ణు మంచు, మనోజ్ మంచు, రవీన టాండన్, హన్సిక, ప్రణిత మొదలగువారు నటిస్తున్నారు. వెనిస్ లో షూటింగ్ పూర్తి ఈ సినిమా టీం త్వరలోనే మిలాన్ లో షూటింగ్ ప్రారంభించనున్నారు. ఫ్యామిలీ ఎంటర్టైనర్ గా తెరకెక్కుతున్న ఈ సినిమాకి శ్రీవాస్ దర్శకత్వం వహిస్తున్నాడు. ఈ సినిమాకి ప్రముఖ రచయితలు గోపి మోహన్, బివిఎస్ రవి, కోన వెంకట్ లు స్క్రీప్ట్ ను అందించారు. ఈ సినిమాకి కీరవాణి, బప్పి, బప్పా లాహిరి, బాబా సెహగల్ లు సంగీతాన్ని అందిస్తున్నారు. ఈ సినిమాని మోహన్ బాబు అతని ఫ్యామిలీ కలిసి నిర్మిస్తున్నారు.