బాలివుడ్ లో మరో చిత్రం చెయ్యబోతున్న విక్రమ్

సిని నటుడు విక్రమ్ బాలివుడ్ లో 2012 లో మరో చిత్రం చెయ్యబోతున్నారు. గత సంవత్సరం విక్రమ్ బాలివుడ్ కి మణి రత్నం చేసిన రావన్ చిత్రం తో పరిచయం అయ్యారు . ఆ చిత్రం బాక్స్ ఆఫీసు వద్ద బోల్తా కొట్టింది. ఇపుడు నూతన సమాచారం ప్రకారం బిజోయ్ నంబియార్ చేస్తున్న “డేవిడ్” అనే చిత్రం లో విక్రమ్ నటిస్తున్నారు. బిజోయ్ ఇంతకముందు “సైతాన్” అనే చిత్రానికి దర్శకత్వం వహించారు. ఆ చిత్రం మంచి పేరు సంపాదించింది “డేవిడ్” చిత్రం ముంబయి మాఫియా చుట్టూ తిరుగుతుందని సమాచారం. విక్రమ్ ఈ చిత్రం కాకుండా ద్విబాషా చిత్రం లో నటిస్తున్నారు. ఈ చిత్రానికి ఏ ఎల్ విజయ్ దర్శకత్వం వహిస్తున్నారు ఈ చిత్రానికి “తాండవం” అని పేరు ని ఖరారు చేసారు ఈ చిత్రం లో జగపతి బాబు ,అనుష్క మరియు ఏమి జాక్సన్ ప్రధాన పాత్రలలో నటిస్తున్నారు.

Exit mobile version