డాన్ గా చెయ్యబోతున్న వెంకటేష్

మెహెర్ రమేష్ తో వెంకటేష్ చేస్తున్న చిత్రం లో వెంకటేష్ “డాన్” పాత్రలో కనపడబోతునట్టు సమాచారం. వెంకటేష్ తొలి సారి “డాన్” పాత్రలో కనిపిస్తున్నారు. ఈ చిత్రం లో జగపతి బాబు పాత్ర చాలా కీలకమవుతుందని అంటున్నారు. ఈ చిత్ర చిత్రీకరణ జనవరి చివర్లో మొదలు కానుంది. రిచా గంగోపాధ్యాయ కథానాయికగా చేస్తున్నారు. కథ,మాటలు కోన వెంకట్ మరియు గోపి కృష్ణ అందిస్తున్నారు. తన గత చిత్రం “శక్తీ” పరాజయం తరువాత ఈ చిత్రం మెహర్ రమేష్ కి చాలా కీలకం కానుంది. ఈ చిత్రాన్ని పరుచూరి ప్రసాద్ నిర్మిస్తున్నారు.

Exit mobile version