త్రిష మరియు జీవా తొలిసారిగా ఒక చిత్రం కోసం కలిసి పని చెయ్యనున్నారు. “ఎండ్రేండ్రుం పున్నగై” అనే ఈ చిత్రం ఈరోజు చెన్నైలో మొదలయ్యింది. అహ్మద్ ఈ చిత్రానికి దర్శకత్వం వహించనున్నారు. ఈ చిత్ర చిత్రీకరణ లో జీవా ఆగస్ట్ నుండి పాల్గొననున్నట్టు సమాచారం ఆయన ఈలోపు మరో రెండు చిత్రాలను పూర్తి చెయ్యవలసి ఉంది.
త్వ్వరలో జీవా మిస్కిన్ దర్శకత్వంలో వస్తున్న సూపర్ హీరో చిత్రం “ముగమూడి” మరియు గౌతం మీనన్ దర్శకత్వంలో “నీదానే ఎన్ పొన్వసాంతం” చిత్రంలో కనిపించనున్నారు.ఇదిలా ఉండగా త్రిష ప్రస్తుతం విశాల్ సరసన నటిస్తున్న “సమర్” చిత్రం కాకుండా ఎటువంటి పెద్ద చిత్రాలను ఒప్పుకోలేదు. ఈ చిత్రానికి హారిస్ జయరాజ్ సంగీతం అందిస్తుండగా సంతానం,నాజర్,లిసా హేడన్ ప్రధాన పాత్రలు పోషిస్తున్నారు. రవితేజ “సార వస్తార” చిత్రం నుండి తప్పుకున్నాక త్రిష ఈ చిత్రానికి ఆ డేట్స్ ని ఇచ్చింది.