హాలీవుడ్ హోర్రేర్ సినిమా విడుదలై నాలుగు వారాలు అవుతున్న హౌస్ ఫుల్ కలెక్షన్లతో ప్రదర్శింపబడుతోంది.ఇలాంటి సినిమా ఇన్ని రోజులు భారీ కలక్షన్లతో ప్రదర్శింపబడటం అందరికి ఆశ్చర్యాన్ని కలిగిస్తోంది. మేము చెబుతున్నది ఇప్పటికి మంచి కలెక్షన్లతో ప్రదర్శింపబడుతున్న ‘ది కాంజరింగ్’ సినిమా గురించి. ఈ సినిమా జూలై 19న విడుదలైంది. ఈ సినిమా ప్రపంచ వ్యాప్తంగా వున్న విమర్శకుల మెప్పును పొందింది. టాలీవుడ్ లో పెద్ద సినిమాలు విడుదల కాకపోవడం వల్లనో లేక సినిమాలో కంటెంట్ వుండడం వల్లనో ఈ సినిమా ఇప్పటికి మల్టీ ప్లెక్ష్స్ లలో మంచి కలెక్షన్లతో ప్రదర్శించ బడుతోంది. ప్రసాద్, ఐనాక్స్ మల్టీ ప్లేక్స్ లలో రోజుకు నాలుగు ఆటలు ప్రదర్శించ బడుతోంది. ఇది నిజం ఈ హాలీవుడ్ సినిమా విడుదలై నాలుగు వారాలు అవుతున్న రెస్పాన్స్ మాత్రం తగ్గడం లేదు. ఈ సినిమాని మీరు మీ దగ్గరలోని థియేటర్స్ లో గాని, మల్టీ ప్లేక్స్ లలో గాని చూసి ఆ అనుభూతిని పొందండి.