బాలకృష్ణ రాబోతున్న చిత్రం “ఆదిత్య 999” చిత్రంలో తను నటించట్లేదని తాప్సీ దృవీకరించారు. 1991 లో విడుదలయ్యి భారీ విజయం సాదించిన “ఆదిత్య 369″ చిత్రానికి ఈ చిత్రం సీక్వెల్. ఈ చిత్రానికి సింగీతం శ్రీనివాస రావు దర్శకత్వం వహిస్తున్నారు. వినోద్ నిర్మిస్తున్న ఈ చిత్రాన్ని కొండా కృష్ణం రాజు ఈ చిత్రాన్ని సమర్పిస్తున్నారు. కొద్దిరోజుల క్రితం ఈ చిత్రంలో అనుష్క డేట్స్ లేని కారణంగా కథానాయికగా తాప్సీని తీసుకున్నారు అన్న పుకారు వచ్చింది. ఒకానొక తాప్సీ అభిమాని దీని గురించి ట్విట్టర్లో అడుగగా ఈ విధంగా సమాధానమిచ్చారు ” మీ ట్వీట్లను గమనిస్తూ వస్తున్నాను నేను ఆదిత్య చిత్రంలో నటించడంలేదు” అని చెప్పారు.ఈ నటి పరిశ్ర్రమలోకి వచ్చి రెండు సంవత్సరాలు అయ్యింది. ఈ విషయం గురించి తాప్సీ మాట్లాడుతూ ” రెండు సంవత్సరాల రెండు రోజులు అయ్యింది మీరు లేకుండా ఇది సాద్యం అయ్యేది కాదు. ఆరు చిత్రాలు విడుదల అయ్యింది ఒకటి విడుదలకు సిద్దమయ్యింది రెండు చిత్రీకరణ దశలో ఉన్నాయి. నాకు చాలా ఆనందంగా ఉంది ఇది తెలుగు చిత్ర విశేషాలు మాత్రమే” అని ట్విట్టర్లో చెప్పారు. ప్రస్తుతం ఈ నటి చంద్రశేఖర్ యేలేటి చిత్రం మరియు మెహర్ రమేష్ దర్శకత్వంలో వస్తున్న “షాడో” లో నటిస్తున్నారు.