చివరగా ముగ్గురు చిత్రంలో నటించిన సౌమ్య బోల్లప్రగడ త్వరలో మెగా ఫోన్ పట్టుకోనుంది. కాని తెలుగు చిత్రం కోసం కాదు. ఒక ప్రముఖ దిన పత్రికతో మాట్లాడుతూ ఇంగ్లీష్ మరియు హిందీ భాషల్లో రూపొందనున్న ద్విభాషా చిత్రానికి దర్శకత్వం వహించనున్నట్లు చెప్పింది. కోన వెంకట్ స్క్రిప్ట్ అందించనున్న ఈ చిత్రానికి శరత్ సినిమాటోగ్రఫీ అందించనున్నారు. ఈ చిత్ర కథ పలు విభిన్నమైన ప్రేమ కథలను తాకుతూ ఉంటుంది. సౌమ్య కూడా ఇందులో కీలక పాత్ర పోషించనుంది.