అలనాటి అందాల నటుడు శోభన్ బాబు గారి 75వ జన్మదినాన్ని పురస్కరించుకొని నిన్న హైదరాబాద్ శిల్ప కళా వేదికలో వజ్రోత్సవ వేడుకలు జరిపారు. ఈ కార్యక్రమానికి దాసరి నారాయణ రావు,కృష్ణ,రామానాయుడు,కృష్ణం రాజు,వెంకటేష్,జయసుధ మరియు రాజకీయ నేతలు సుష్మ స్వరాజ్, ఆంధ్ర ప్రదేశ్ ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి హాజరయ్యారు. అతిధులంతా శోభన్ బాబు గారి కీర్తిని స్మరించుకున్నారు అయన సాదించిన విజయాల గురించి మాట్లాడారు.ఈ వజ్రోత్సవ కార్యక్రమాన్ని ఆంధ్రప్రదేశ్ శోభన్ బాబు అభిమానులు నిర్వహించారు. గతంలో శోభన్ బాబుతో కలిసి పని చేసిన 75 మంది నటులకు ఆర్ధిక సహాయం కూడా చేశారు.ఈ కార్యక్రమంలో దాసరి మాట్లాడుతూ ఆరు ఫిలిం ఫేర్ అవార్డులను గెలుచుకున్న ఏకైక నటుడు శోభన్ బాబు అన్నారు.శోభన్ బాబుకి మహిళల్లో అభిమానులు ఎక్కువ. దాదాపుగా రెండు దశాబ్దాలలో 200 చిత్రాలలో నటించారు.