నందిని రెడ్డిని ప్రశంశిస్తున్న సమంత,సిద్దార్థ్

నందిని రెడ్డిని ప్రశంశిస్తున్న సమంత,సిద్దార్థ్

Published on Mar 20, 2012 8:53 PM IST

సమంత మరియు సిద్దార్థ్ వారి రాబోయే చిత్రం దర్శకురాలు నందిని రెడ్డిని ప్రశంశలలో ముంచెత్తుతున్నారు. ఒక వారం క్రితం మొదలయిన చిత్రీకరణలో పాల్గొంటున్న సిద్దార్థ్ మరియు సమంత ట్విట్టర్ లో ఈ చిత్ర దర్శకురాలు నందిని గురించి చాలానే ప్రస్తావిస్తున్నారు. ” నందిని సెట్ లో చాలా సానుకూలత కనిపిస్తుంది…..మేము పాండా(నందిని) ని గెలుచుకున్నాం” అని సమంత అన్నారు. “నందిని సెట్ లో చాలా అద్బుతమయిన ఎనర్జీ కనిపిస్తుంది ఈవిడ ఎనర్జీని ఎలా వర్ణించను” అని సిద్దార్థ్ అన్నారు. ఈ చిత్ర మొదటి షెడ్యూల్ ఈరోజు పూర్తయ్యింది. బెల్లంకొండ సురేష్ నిర్మిస్తున్న ఈ చిత్రానికి తమన్ సంగీతం అందిస్తున్నారు. ఇంకా పేరు పెట్టని ఈ చిత్రం హాస్యం మరియు ప్రేమ మిళితం అయిన చిత్రం .

తాజా వార్తలు