కొత్త కాలక్షేపం వెతుక్కున్న శ్రద్ద దాస్

కొత్త కాలక్షేపం వెతుక్కున్న శ్రద్ద దాస్

Published on Mar 27, 2012 8:50 PM IST

శ్రద్ద దాస్ ఈ మధ్య చిన్న చిన్న సెలవుల్ని తీసుకుంటున్నారు. ఈ నెల మొదట్లో “రేయ్” చిత్ర చిత్రీకరణలో పాల్గొన్న ఈ నటి ఈ మధ్యనే చిత్రీకరణ అయిపోగానే ముంబైకి పయనమయిపోయారు. గత కొన్ని రోజులుగా ఈ నటి కొత్తరకమయిన కాలక్షేపం చేస్తున్నారు ముంబైలో నాటకాలు చూస్తూ గడుపుతున్నారు. ఇప్పటికే ఈ భామ ముంబైలో ప్రసిద్ద నాటక రంగం పృథ్వి థియేటర్ లో ఇప్పటికే మూడు నాటకాలను చూశారు. ” పృథ్వి థియేటర్ కి ” డర్టీ టాక్” నాటకం చూడటానికి వచ్చాను ఇక్కడ నాటకాలకు దాసోహం అయిపోతున్నా” అని చెప్పారు. ఇది కాకుండా హైదరాబాద్ లో జరుగుతున్న ఈవెంట్స్ లో పాల్గొనేవారు. “రేయ్” చిత్రం లో ఈ తార పాప సింగర్ పాత్రలో కనిపించబోతున్నారు. సాయి ధరం తేజ్ పక్కన నటిస్తున్న ఇద్దరు ప్రధాన తారలలో ఈ నటి ఒకరు.

తాజా వార్తలు