సీతమ్మ వాకిట్లో సోలో పాట పాడుకుంటున్న సమంతా

సీతమ్మ వాకిట్లో సోలో పాట పాడుకుంటున్న సమంతా

Published on Feb 19, 2012 10:09 PM IST

సీతమ్మ వాకిట్లో సిరిమల్లె చెట్టు చిత్రంలో సమంతా హీరొయిన్ గా నటిస్తున్న విషయం తెలిసిందే. ప్రస్తుతం ఈ చిత్ర షూటింగ్ తమిళనాడులోని కుట్రాలం షూటింగ్ జరుపుకుంటుంది. మా విశ్వసనీయ వర్గాల సమాచారం ప్రకారం సమంతాకి ఈ చిత్రంలో ఒక సోలో పాట ఉన్నట్లు సమాచారం. తనకు రాబోయే వరుడు ఎలా ఉండాలో ఊహించుకుంటూ పాడుకునే పాట అని చెబుతున్నారు. వెంకటేష్, మహేష్ బాబు, సమంతా, అంజలి ముఖ్య పాత్రల్లో నటిస్తున్న ఈ చిత్రానికి శ్రీకాంత్ అడ్డాల దర్శకత్వం వహిస్తున్నారు. కెవి గుహన్ సినిమాటోగ్రఫీ అందిస్తున్న ఈ చిత్రానికి మిక్కీ జే మేయర్ సంగీతమ అందిస్తున్నారు. శ్రీ వెంకటేశ్వరా క్రియేషన్స్ బ్యానర్ పై దిల్ రాజు ప్రతిష్టాత్మకంగా తెరకెక్కిస్తున్నారు.

తాజా వార్తలు