దర్శకుల సంఘం నూతన అధ్యక్షుడు సాగర్

దర్శకుల సంఘం నూతన అధ్యక్షుడు సాగర్

Published on Mar 12, 2012 10:00 AM IST

ఆది వారం ఇక్కడ జరిగిన తెలుగు చిత్ర దర్శకుల సంఘం ఎన్నికల్లో వి.సాగర్ గెలుపొందారు. గతం లో రెండు సార్లు విజేతగా నిలిచిన సాగర్ ఈ సారి ఎం.శంకర్ పై 44 ఓట్ల తేడాతో గెలుపొందారు.ఉదయం 8 గంటల నుంచి మధ్యాహ్నం 2 గంటల వరకూ కొనసాగిన పోలింగ్‌లో మొత్తం 666 ఓట్లు పోలయ్యాయి. ఈ ఎన్నికల్లో దర్శకుడు కె.రాఘవేంద్రరావు, జీవిత, పరుచూరి గోపాలకృష్ణ, వీవీ వినాయక్, మెహర్ రమేష్, ఎం.ఎస్.రాజు తదితరులు ఓటు హక్కు వినియోగించుకున్నారు. ప్రధాన కార్యదర్శి పదవికి చంద్రమహేష్, మద్దినేని రమేష్‌లు పోటీలో నిలువగా రమేష్ విజయం సాధించారు.

తాజా వార్తలు