విక్రమార్కుడు రిమేక్ లో రిచా గంగోపాధ్యాయ

అగ్ర దర్శకుడు రాజమౌళి డైరెక్షన్లో కామెడీ యాక్షన్ ఎంటర్టైనర్ చిత్రం. రవితేజ హీరోగా నటించిన ఈ చిత్రం భారీ విజయం సాధించిన విషయం తెలిసిందే. ఈ చిత్రం తమిళ్ లో కార్తి హీరోగా తమన్నా హీరోయిన్ గా ‘సిరుతై’ పేరుతో రిమేక్ అయింది. తమిళ్ లో కూడా విజయం సాధించింది. హిందీలో అక్షయ్ కుమార్ తో కిలాడీ 786 పేరుతో రిమేక్ చేస్తున్నారు. ఇలియానా హీరోయిన్ కాగా ఆశిష్ ఆర్ మోహన్ డైరెక్ట్ చేస్తున్నారు. తాజాగా ఈ చిత్రాన్ని బెంగాళీలో కూడా రిమేక్ చేస్తున్నారని సమాచారం. రాజీబ్ దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రంలో ప్రోసేన్జీత్ హీరోగా రిచా గంగోపాధ్యాయ హీరోయిన్ గా నటిస్తున్నారు. దీని గురించి అధికారికంగా ఎటువంటీ సమాచారం లేదు. రిచా ప్రస్తుతం కొరటాల శివ డైరెక్షన్లో ప్రభాస్ సరసన వారధి చిత్రంలో నటిస్తుంది.

Exit mobile version