పెళ్లి చేసుకున్న రీమాసేన్

పెళ్లి చేసుకున్న రీమాసేన్

Published on Mar 12, 2012 11:53 PM IST

రీమా సేన్ తన బాయ్ ఫ్రెండ్ శివ్ కరణ్ సింగ్ ని మనువాడింది. ఈ పెళ్లి ఢిల్లీ లో రెండు వేల మంది అతిధుల నడుమ అంగరంగ వైభవంగా జరిగింది. ఒకానొక ప్రముఖ పత్రికతో మాట్లాడుతూ రీమాసేన్ ఇలా అన్నారు తను ఒక సంవత్సరం క్రితం కరణ్ ని కలిశారని స్నేహం తో మొదలయిన పరిచయం ప్రేమగా మారిందని అన్నారు. పెళ్లి తరువాత నటనను వదులుకోవాలని అనుకోట్లేదు అని కూడా చెప్పారు. దశాబ్ద కాలం క్రితం ఈ నటి “చిత్రం”,”మనసంతా నువ్వే” వంటి చిత్రాల్లో నటించి ప్రేక్షకులను మెప్పించారు. తరువాత తమిళ పరిశ్రమకు మారిపోయారు ఈ మధ్యనే “ముగ్గురు” అనే చిత్రం లో కూడా నటించారు మరియు “వీడింతే” చిత్రం లో ఒక ఐటెం సాంగ్ ని చేశారు. త్వరలో అనురాగ్ కశ్యప్ చిత్రం “గాంగ్స్ అఫ్ వసేపూర్ ” లో కనిపించబోతున్నారు.

తాజా వార్తలు