సోలో చిత్ర దర్శకుడు పరుశురాం మాస్ మహారాజ రవితేజ తో చిత్రం చెయ్యబోతున్నారు. పూరి జగన్నాథ్ తో చేస్తున్న చిత్రం పూర్తవ్వగానే రవితేజ ఈ చిత్ర షూటింగ్ లో పాల్గొంటారు. జూన్ నుండి ఈ చిత్ర చిత్రీకరణ ఉండవచ్చని అంటున్నారు. ఈ చిత్రాన్ని వైజయంతి మూవీస్ బ్యానర్ మీద అశ్విని దత్ నిర్మిస్తున్నారు. ఒక ప్రముఖ కథానాయికను ఈ చిత్రం లో కథానాయిక పాత్ర కోసం సంప్రదించినట్టు సమాచారం, గతం లో రవి తేజ పరుశురాం తో కలిసి “ఆంజనేయులు” చిత్రం చేశారు. ఈ చిత్ర అధికారిక విషయాలు త్వరలో ప్రకటిస్తారు.