మరో సినిమాటోగ్రాఫర్ దర్శకుడిగా మారనున్నారు. సంతోష్ శివన్ మరియు కే వి ఆనంద్ వంటి కెమరా మాన్ లు దర్శకులుగా మారిన తరువాత ఇప్పుడు రవి కే చంద్రన్ దర్శకుడిగా మారుతున్నారు. ఒక తమిళ చిత్రానికి ఈయన దర్శకత్వం వహించనున్నారు. పలు తమిళ మరియు హిందీ చిత్రాలకు ఈయన సినిమాటోగ్రఫీ అందించారు. “దిల్ చాహత హాయ్” , “అమృత”,”యువ”,”7th సెన్స్” మరియు “ఏక్ థా టైగర్” వంటి చిత్రాలకు ఈయన సినిమాటోగ్రఫీ అందించారు. ఈ చిత్రంలో జీవ కథానాయకుడిగా నటించనున్నాడని సమాచారం. ఈ చిత్రానికి ఏ కథానాయకుడు సంతకం చెయ్యలేదు. ఆర్ ఎస్ ఇన్ఫోటైన్మెంట్ ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. ఈ చిత్రానికి ఆయనంక బోస్ సినిమాటోగ్రాఫర్ గా చెయ్యనున్నారు. ఈ చిత్రం గురించి మరిన్ని విశేషాలు త్వరలో వెల్లడిస్తారు.