అగ్ర దర్శకుడు రాజమౌళి మహేష్ బాబుతో సినిమా చేయాలని నిర్ణయించుకున్నారు. ఈ విషయాన్ని రాజమౌళి గారే స్వయంగా తెలిపారు. మహేష్ బాబు నటించిన ‘బిజినెస్ మేన్’ ఆడియో ఇటీవలే విడుదలయింది. ఈ వేడుకలో రాజమౌళి ఈ విషయాన్ని ప్రస్తావించారు. మహేష్ కి ఎలాంటి పాత్ర అయితే బావుంటుందని పరిశీలిస్తున్నామని తెలిపారు. కౌబాయ్, స్వాతంత్ర మరయోధుడు అల్లూరి సీతారామ రాజు, జేమ్స్ బాండ్ వీటిలో మహేష్ కి ఎలాంటి పాత్ర అయితే బావుంటుందో మహేష్ ఫ్యాన్స్ నిర్ణయించాలని చెప్పారు. ఇప్పటి వరకు వీరిద్దరి కాంబినేషన్లో సినిమా రాబోతుందని వస్తున్న పుకార్లకు ఈ వ్యాఖ్యలు జీవం పోసినట్లయింది. త్వరలోనే వీరిద్దరి కంబినేశాన్లో వస్తుందని ఆశిద్దాం. పూరి డైరెక్షన్లో మహేష్ నటించిన బిజినెస్ మేన్ జనవరి 11న విడుదలకి సిద్ధమైంది.
తాజా వార్తలు
వీక్షకులు మెచ్చిన వార్తలు
- ‘కింగ్డమ్’ కొత్త సమస్య.. ప్రీమియర్ షోలకు కుదరట్లేదుగా..!
- బాబీతో చిరు నెక్స్ట్ చిత్రం మొదలయ్యేది అప్పుడేనా..?
- ఓటిటి సమీక్ష: ‘మండల మర్డర్స్’ – తెలుగు డబ్ సూపర్ నాచురల్ థ్రిల్లర్ సిరీస్ నెట్ ఫ్లిక్స్ లో
- ‘కింగ్డమ్’లో ఆ సర్ప్రైజింగ్ రోల్ కూడా అతడేనా?
- ‘వీరమల్లు’కి అసలు పరీక్ష.. నెగ్గే ఛాన్స్ ఉంది!
- ‘వీరమల్లు’ టికెట్ ధరలు తగ్గింపు.. ఎప్పటినుంచి అంటే!
- ఓటిటి డేట్ ఫిక్స్ చేసేసుకున్న నితిన్ ‘తమ్ముడు’
- ‘ఆంధ్ర కింగ్ తాలూకా’.. వారం రోజులపాటు చీకట్లోనే..!