రామ్ చరణ్-తమన్నా జంటగా నటిస్తున్న ‘రచ్చ’ చిత్రం ఫెబ్రవరిలో విడుదలకు సిద్ధమవుతుంది. తాజా సమాచారం ప్రకారం కొత్త సంవత్సరం మెగాస్టార్ ఫ్యాన్స్ కు కానుకగా చిత్ర ఫస్ట్ లుక్ మరియు టీసర్ ను జనవరి 1న విడుదల చేయబోతున్నారు. సంపత్ నంది డైరెక్ట్ చేస్తున్న ఈ చిత్రం కంప్లీట్ మాస్ యాక్షన్ ఎంటర్టైనర్ గా రూపొందుతున్న ఈ చిత్రంలో రామ్ చరణ్ మెడికల్ కాలేజీ స్టూడెంట్ గా కనిపించబోతున్నాడు. రంగం ఫేం అజ్మల్ విలన్ గా నటిస్తున్న రచ్చ చిత్ర షూటింగ్ ప్రస్తుతం హైదరాబాదులో జరుపుకుంటుంది. మెగా సూపర్ గుడ్ ఫిల్మ్స్ బ్యానర్ పై ఎన్.వి ప్రసాద్ మరియు పరాస్ జైన్ నిర్మిస్తున్నారు. మణిశర్మ సంగీతం అందిస్తుండగా గ్యాంగ్ లీడర్ చిత్రంలోని వాన వాన వెల్లువాయే పాటని రేమిక్స్ చేయబోతున్నారు.