తమిళ నాడు లో భారీగా విడుదల కాబోతున్న “రచ్చ’

తమిళ నాడు లో భారీగా విడుదల కాబోతున్న “రచ్చ’

Published on Mar 12, 2012 10:08 PM IST

రామ్ చరణ్ తేజ ,తమన్నాలు ప్రధాన పాత్రల లో నటిస్తున్న చిత్రం “రచ్చ” తమిళ నాడు లో భారి స్థాయిలో విడుదల కాబోతుంది. “రగలై ” అనే పేరుతో విడుదల కాబోతున్న ఈ చిత్రం అక్కడ భారి స్థాయిలో విడుదల చెయ్యాలని నిర్మాతలు అనుకుంటున్నారు అక్కడ తమన్నా కి ఉన్న పేరు వల్ల ఈ చిత్రానికి మంచి ఓపెనింగ్స్ వస్తాయని నిర్మాతల నమ్మకం ఈ చిత్రం లో ప్రధాన పాత్రలు పోషించిన అజ్మల్ అమీర్ మరియు పార్తీవన్ కూడా అక్కడ పరిచయం ఉన్న నటులే మగధీర తమిళ చిత్రం “మావీరాన్” తో రామ్ చరణ్ కూడా తనదయిన ముద్ర వేసారు. రగలై చిత్రం కూడా మంచి వసూళ్లు సాదిస్తుందని నిర్మాతలు నమ్ముతున్నారు. సంపత్ నంది దర్శకత్వం వహించిన ఈ చిత్రాన్ని ఎం వి ప్రసాద్ మరియు పరాస్ జైన్ లు మెగా సూపర్ గుడ్ మూవీస్ పతాకం మీద నిర్మించారు మణిశర్మ అందించిన సంగీతం మార్చ్ 11 న విడుదల అయింది ఈ చిత్రం మార్చ్ చివరి వారం లో విడుదల కావలిసి ఉంది కాని చరణ్ కి తగిలిన గాయం మూలాన చిత్రం మూడు నుండి నాలుగు వారాల వరకు వాయిదా పడనుంది.

తాజా వార్తలు