చార్మింగ్ బ్యూటీ చార్మీ ప్రధాన పాత్రలో తెరకెక్కుతున్న ‘ప్రేమ ఒక మైకం’ ఆడియో విడుదల కార్యక్రమం ఈ రోజు హైదరాబాద్లో జరగనుంది. ఈ సినిమాలో చార్మీ వేశ్య పాత్రలో కనిపించనుంది. ఇప్పటి వరకూ ఎన్నో బోల్డ్ గా ఉండే పాత్రలు చేసిన చార్మీ ఈ సినిమా కోసం కొంత మార్చుకున్నాని చెబుతోంది. ‘ ప్రతి సినిమాకి పాత్ర పరంగా నాకు కొన్ని పరిమితులు ఉంటాయి కానీ నేను ఈ సినిమా కోసం బాగా ఆలోచించాను. ప్రయోగాత్మక పాత్రలు చేసేటప్పుడు పాత్ర కోసం మన పరిమితుల జోన్ ని దాటివచ్చి పాత్రకి న్యాయం చేయాల్సి వస్తుందని నాకు నేను చెప్పుకొని ఈ సినిమా చేసానని’ చార్మీ తెలిపింది. రాహుల్ రైటర్ గా కనిపించనున్న ఈ సినిమాలో శరణ్య సింగర్ గా కనిపించనుంది. ఈ సినిమా మొత్తం ఈ మూడు పాత్రల చుట్టూనే తిరుగుతూ ఉంటుంది. గతంలో ’10th క్లాస్’ ‘నోట్ బుక్’ సినిమాలు తీసిన చందు ఈ సినిమాకి డైరెక్టర్. టూరింగ్ టాకీస్ బ్యానర్ పై వెంకట్ సురేష్ – సూర్య శ్రీకాంత్ సంయుక్తంగా నిర్వహిస్తున్న ఈ సినిమాకి ప్రవీణ్ సంగీతం అందించాడు.
నేడే చార్మీ ప్రేమ ఒక మైకం ఆడియో
నేడే చార్మీ ప్రేమ ఒక మైకం ఆడియో
Published on Apr 14, 2013 3:52 PM IST
సంబంధిత సమాచారం
- ‘బిగ్ బాస్ 9’.. మొదటి ఎలిమినేట్ ఎవరంటే ?
- ఓటిటి సమీక్ష: ‘తను రాధే నేను మధు’ – తెలుగు లఘు చిత్రం ఈటీవీ విన్ లో
- అప్పుడు ఇడ్లీకి కూడా డబ్బులు లేవు – ధనుష్
- ‘డ్రాగన్’ కోసం కొత్తగా ట్రై చేస్తోన్న ఎన్టీఆర్ ?
- ‘మహేష్’ సినిమా కోసం భారీ కాశీ సెట్ ?
- పరిపూర్ణ రచయితగా ఎదగాలనేది నా బలమైన కోరిక – గీత రచయిత శ్రీమణి
- పవన్ ఆ విద్యను ప్రోత్సహించాలి – సుమన్
- ఆయన మరణాన్ని తట్టుకోలేకపోయారు – రజనీకాంత్
- ‘ఓజి’, ‘ఉస్తాద్’ లని ముగించేసిన పవన్.. ఇక జాతరే
తాజా వార్తలు
వీక్షకులు మెచ్చిన వార్తలు
- క్రేజీ క్లిక్: ‘ఓజి’ ఫ్యాన్స్ కి ఇది కదా కావాల్సింది.. పవన్ పై థమన్ సర్ప్రైజ్ ఫోటో
- ‘ఉస్తాద్ భగత్ సింగ్’ పై సాలిడ్ అప్డేట్ ఇచ్చిన హీరోయిన్!
- ఆ సినిమాతో 200 కోట్లు నష్టాలు – అమీర్ ఖాన్
- ఆయన మరణాన్ని తట్టుకోలేకపోయారు – రజనీకాంత్
- ‘డ్రాగన్’ కోసం కొత్తగా ట్రై చేస్తోన్న ఎన్టీఆర్ ?
- ‘మన శంకర వరప్రసాద్ గారు” కోసం భారీ సెట్.. ఎక్కడంటే ?
- బాలయ్య ‘అఖండ 2’లో మరో గెస్ట్ రోల్ ?
- నాని ‘ప్యారడైజ్’లో మోహన్ బాబు.. లీక్ చేసిన మంచు లక్ష్మి