పవన్ కళ్యాణ్ ,శ్రుతి హాసన్ లు ప్రధాన పాత్రలలో వస్తున్న చిత్రం “గబ్బర్ సింగ్”. ఈ చిత్రం ఈ వారం మొత్తం చిత్రీకరణ జరుపుకోనుంది. సంక్రాంతి పండుగను కుటుంబ సభ్యులతో జరుపుకోటం పరిశ్రమలో ఆనవాయితి కాని ఈ సారి ఈ చిత్ర బృందం చిత్రీకరణ పూర్తయ్యేంతవరకు ఎటువంటి విరామం తీసుకోదలుచుకోలేదు. హరీష్ శంకర్ దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రం ప్రస్తుతం హైదరాబాద్ లో చిత్రీకరణ జరుపుకుంటుంది. గణేష్ ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. దేవి శ్రీ ప్రసాద్ సంగీతం అందిస్తున్నారు. ఏప్రిల్ 27న ఈ చిత్ర విడుదలకు సన్నాహాలు చేస్తున్నారు.