“నిప్పు” ఆడియో విడుదల జనవరి 2 కి వాయిదా పడింది. గతం లో ఇది డిసెంబర్ 28 న విడుదల చెయ్యాలని అనుకున్నారు కాని అది కుదరలేదు. ఈ చిత్రానికి గుణ శేఖర్ దర్శకత్వం వహిస్తుండగా, వై వి ఎస్ చౌదరి నిర్మిస్తున్నారు. రవితేజ మరియు దీక్ష సెత్ ప్రధాన పాత్రలలో నటిస్తున్నారు. తమన్ సంగీతాన్ని సమకూరుస్తున్నారు. ఈ చిత్రం జనవరి 13 న విడుదల కానుంది.