ఆడియో విడుదల తేదిని ఖరారు చేసుకున్న “నిప్పు”

నిప్పు ఆడియో విడుదల తేది ఎట్టకేలకు ఖరారు అయ్యింది. ఈ చిత్ర ఆడియో విడుదల తేది మీద గతం లో తర్జన బర్జనలు జరిగాయి. గతం లో ఈ చిత్ర ఆడియో జనవరి మొదటి వారం లో జరుగుతుంది అని చెప్పగా ఇప్పుడు ఈ తేది జనవరి 14 గా ఖరారు అయ్యింది. ఈ చిత్రానికి గుణశేఖర్ దర్శకత్వం వహించగా రవి తేజ మరియు దీక్షా సెత్ ప్రధాన పాత్రలలో నటిస్తున్నారు. వై.వి.ఎస్.చౌదరి చిత్రాన్ని నిర్మిస్తున్నారు. ఫిబ్రవరి 2 న ఈ చిత్రం విడుదల కానుంది.

Exit mobile version