భారీగా జరగనున్న కలెక్షన్ కింగ్ మోహన్ బాబు జన్మదిన వేడుకలు

భారీగా జరగనున్న కలెక్షన్ కింగ్ మోహన్ బాబు జన్మదిన వేడుకలు

Published on Mar 18, 2012 8:41 PM IST

కలెక్షన్ కింగ్ మోహన్ బాబు జన్మదిన వేడుకలు ఎప్పటిలానే ఈ సంవత్సరం కూడా భారీగా జరుగబోతున్నాయి. ఈ వేడుకకు పలువురు పెద్దలు హాజరు కాబోతున్నారు. అదే రోజు శ్రీ విద్యానికేతన్ కాలేజ్ వేడుకలు కూడా జరగనుండటంతో ఈ వేడుకలకు మరింత ప్రాముఖ్యత తోడయ్యింది. తిరుపతి లో శ్రీ విద్యానికేతన్ కళాశాల లో ఈ వేడుకలు మార్చ్ 19న జరగనున్నాయి. నారా చంద్రబాబు నాయుడు, దీప వెంకట్ (బిజెపి అధినేత వెంకయ్య నాయుడు కుమార్తె),ఎమ్ మునిరత్నం నాయుడు, దాసరి నారాయణ రావు,కె,రాఘవేంద్ర రావు,బి.గోపాల్ మరియు తదితరులు ఈ వేడుకలో పాల్గొననున్నారు. 123తెలుగు.కాం తరుపున మోహన్ బాబు గారికి ముందస్తు జన్మదిన శుభాకాంక్షలు.

తాజా వార్తలు