మోహన్ బాబు – విష్ణు – మనోజ్ కాంబినేషన్లో మల్టీ స్టారర్.!

మోహన్ బాబు – విష్ణు – మనోజ్ కాంబినేషన్లో మల్టీ స్టారర్.!

Published on Apr 14, 2013 6:11 PM IST

M

తెలుగు ఫిల్మ్ ఇండస్ట్రీలో మల్టీ స్టారర్ ట్రెండ్ ఇప్పుడిప్పుడే మొదలవుతోంది. ఈ సంవత్సరం మొదట్లో వచ్చిన ‘సీతమ్మ వాకిట్లో సిరిమల్లె చెట్టు’ విజయంతో మల్టీ స్టారర్ ట్రెండ్ మరింత ఊపందుకుంది. మొదటి సారి డా. మోహన్ బాబు, అతని కుమారులు విష్ణు, మనోజ్ లు కలిసి ఓ మల్టీ స్టారర్ సినిమా చేయనున్నారు. ఇంకా టైటిల్ ఖరారు కాని ఈ సినిమాలో వరుణ్ సందేశ్, తనీష్, రవీనా టాండన్, హన్సిక, ప్రణితలు కూడా ప్రధాన పాత్రల్లో కనిపించనున్నారు. గతంలో ‘లక్ష్యం’, ‘రామ రామ కృష్ణ కృష్ణ’ సినిమాలు తీసిన శ్రీ వాస్ ఈ సినిమాకి డైరెక్టర్. ఈ సినిమాని శ్రీ లక్ష్మీ ప్రసన్న పిక్చర్స్ – 24 ఫ్రేమ్స్ ఫాక్టరీ బ్యానర్స్ పై తొలిసారి మనోజ్ – విష్ణు కలిసి సంయుక్తంగా నిర్మించనున్నారు.

ఏప్రిల్ 21న లాంచనంగా ప్రారంభం కానున్న ఈ సినిమాకి కోనా వెంకట్, గోపీ మోహన్, బి.వి.ఎస్ రవిలు కలిసి స్క్రిప్ట్ అందించారు. నలుగురు టాప్ మ్యూజిక్ డైరెక్టర్స్ సంగీతం అందించనున్న ఈ సినిమాకి ఫలని కుమార్ సినిమాటోగ్రాఫర్. ‘ పూర్తి కామెడీ ఫ్యామిలీ ఎంటర్టైనర్ గా తెరకెక్కనున్న ఈ సినిమాతో ఆడియన్స్ అంచనాలను ఖచ్చితంగా రీచ్ అవుతాము. మొదటి సారి ఇద్దరం కలిసి సినిమాని నిర్మిస్తున్నాం. అదీ మమ్మల్ని ఇండస్ట్రీకి పరిచయం చేసిన మా నాన్నగారితో కలిసి నిర్మించడం ఎంతో గౌరవం గానూ, ఆనందం గానూ ఉందని’ విష్ణు – మనోజ్ లు మీడియాకి తెలిపారు. ఈ సినిమాకి సంబందించిన పూర్తి వివరాలు మరికొద్ది రోజుల్లో తెలియజేయనున్నారు.

తాజా వార్తలు