నిర్మాతగా ముప్పై సంవత్సరాలు పూర్తి చేసుకున్న మోహన్ బాబు

కలెక్షన్ కింగ్ మోహన్ బాబు నిర్మాతగా ముప్పై సంవత్సరాలు పూర్తి చేసుకున్నారు. విశ్వ విఖ్యాత నట సార్వభౌమ నందమూరి తారక రామారావు చేతుల్లో 1982లో శ్రీ లక్ష్మి ప్రసన్న పిక్చర్స్ “ప్రతిజ్ఞ” చిత్రంతో మొదలయ్యింది.”అప్పుడు అన్నగారు “బొబ్బిలి పులి” చిత్ర చిత్రీకరణలో ఉన్నారు అక్కడ నుండి నేరుగా ఆ చిత్ర కాస్ట్యుంతోనే వచ్చి ప్రారంభించారు. నారా చంద్ర బాబు నాయుడు కెమెరా ఆన్ చేశారు. నేను విజయవంతంగా 56 చిత్రాలను నిర్మించాను. నా వెనకుండి నన్ను ప్రోత్సహించిన తెలుగు ప్రేక్షకులకి నా కృతజ్ఞతలు” అని మోహన్ బాబు అన్నారు.

ఇలానే భవిష్యత్తులో మరిన్ని చిత్రాలను నిర్మిస్తారని ఆశిస్తూ మోహన్ బాబు గారికి మా శుభాకాంక్షలు తెలియజేస్తున్నాం

Exit mobile version