నాగార్జున లవ్ స్టొరీ లో మీరా చోప్రా

తెలుగు చిత్ర పరిశ్రమలో మీరా చోప్రా రెండవ ఇన్నింగ్స్ లో సరయిన ఆరంభం దొరికినట్టు లేదు. నాగార్జున రాబోతున్న చిత్రం “లవ్ స్టొరీ”లో ఈ భామ ఒక కీలక పాత్ర పోషించనున్నారు. మీరా చోప్రా చివరగా నితిన్ “మారో” చిత్రంలో కనిపించారు. ఈ చిత్రం పరాజయం పొందిన తరువాత చిత్ర పరిశ్రమ నుండి దూరంగా ఉండాలని నిర్ణయించుకుంది.చాలా రోజుల తరువాత ఈ భామ ఒక చిత్రాన్ని ఒప్పుకుంది. ఈ చిత్రానికి దశరథ్ దర్శకత్వం వహిస్తున్నారు. ఈ చిత్ర ప్రధాన బాగా చిత్రీకరణ హైదరాబాద్ లో మొదలయ్యింది. కామాక్షి కళ మూవీస్ బ్యానర్ మీద డి శివ ప్రసాద్ రెడ్డి ఈ చిత్ర్రాన్ని నిర్మిస్తున్నారు. నయనతార ఈ చిత్రంలో నాగార్జున సరసన నటిస్తున్నారు. ఇంద్దులో నాగార్జున ఇండియా కి మొదటిసారి వచ్చిన NRI గా కనిపించబోతున్నారు. తమన్ ఈ చిత్రానికి సంగీతం అందిస్తుండగా అనిల్ బండారి సినిమాటోగ్రఫీ అందిస్తున్నారు.

Exit mobile version