నితిన్ సినిమాని డైరెక్ట్ చేయబోతున్న మారుతీ?

నితిన్ సినిమాని డైరెక్ట్ చేయబోతున్న మారుతీ?

Published on Mar 25, 2012 8:40 PM IST

ప్రస్తుతం ఇండస్ట్రీలో వినిపిస్తున్న తాజా సమాచారం ప్రకారం ఇటీవలే ‘ఈ రోజుల్లో’ చిత్రానికి దర్శకత్వం వహించిన మారుతీ మరియు చాలా రోజుల తరువాత ‘ఇష్క్’ సినిమాతో విజయాన్ని అందుకున్న నితిన్ కలిసి పనిచేయబోతున్నారు. ఇష్క్ విజయం తరువాత రెండు ప్రాజెక్టులు అంగీకరించిన నితిన్ వాటితో పాటు మారుతీ డైరెక్షన్లో చేయడానికి కూడా అంగీకరించినట్లు సమాచారం. అందులో ఒకటి నందిని రెడ్డితో కాగా మరొకటి సంతోష్ శ్రీనివాస్ డైరెక్షన్లో నటించనున్నాడు. మారుతీ డైరెక్షన్లో నటించనున్న ఈ చిత్రాన్ని బెల్లంకొండ సురేష్ నిర్మించబోతున్నాడు. ఈ చిత్రానికి సంభందించిన పూర్తి వివరాలు త్వరలోనే అధికారికంగా తెలియజేయనున్నారు.

తాజా వార్తలు