2011 లో అగ్రస్థానం లో నిలిచిన మహేష్ బాబు

వివాదాలను పక్కన పెడితే 2011 మహేష్ బాబు సంవత్సరం అని చెప్పవచ్చు .ఈ సంవత్సరం పరిశ్రమ లో అగ్ర హీరో ల లో “సూపర్ హిట్” సాదించిన ఒకే ఒక హీరో మహేష్ బాబు. మిగిలిన హీరోలు పరవలేదనిపించారు ఉదా: శ్రీ రామ రాజ్యం తో బాలకృష్ణ రాజన్న చిత్రం తో నాగార్జున. ఇంకాస్త వెనక్కి వెళ్తే 100 % లవ్ మంచి విజయం సాదించింది కాని దడ మరియు బెజవాడ చిత్రాలతో నాగ చైతన్య ఆ పేరుని నిలబెట్టుకోలేకపోయాడు. శక్తి చిత్రం లో విషయం ఏమి లేకపోయినా వసూళ్లు మాత్రం బానే వచ్చాయి. బద్రీనాథ్ విషయం లో కూడా ఇదే జరిగింది. రవి తేజ నటించిన మిరపకాయ వసూళ్లు రాబట్టుకుంది కాని వెంటనే వచ్చిన వీర చిత్రం నిరాశ పరిచింది. అలా మొదలయింది,పిల్ల జమిందార్ వంటి చిత్రాలు విజయం సాదించాయి. బాక్స్ ఆఫీస్ పరాజయాల నుండి ప్రభాస్ ను మిస్టర్ పర్ఫెక్ట్ బయటపడేసింది. పవన్ కళ్యాణ్ కి ఈ సంవత్సరం కూడా కలిసిరాలేదు.

Exit mobile version