కాజల్ అగర్వాల్ ఇప్పుడు సి.సి.ఎల్ కి ప్రచార కర్తగా మారింది. మొదటి సీజన్లో కాజల్ ఎక్కడా కనపడలేదు కాని ఈ సీజన్లో లో కేరళ మరియు వెస్ట్ బెంగాల్ లు కూడా కలవడంతో నిర్వాహకులు మరికొంత అందాన్ని ఆపాదిస్తున్నారు. ఇప్పటికే వున్నా శ్రియ శరణ్ ,ప్రియమణి దీక్ష సెత్ మాధురి భట్టాచార్య మరియు పాయల్ సర్కార్ లతో ఇప్పుడు కాజల్ చేరబోతుంది. రిచా,జెనిలియా,చార్మి,కంగనా,సోనాక్షి,అమలా పాల్,సమీర రెడ్డి ,లక్ష్మి రాయి,భావన మరియు నిధి సుబ్బయ్య వేరు వేరు టీం ల కు ప్రచార కర్తగా చేస్తున్నారు. షార్జా లో మొదటి మ్యాచ్ తెలుగు వార్రియర్స్ మరియు ముంబాయి హీరోస్ మధ్యలో ఈ నెల 13 నుండి జరగనుంది. రెండు రోజుల్లో తారలందరు షార్జాకు పయనమవుతున్నారు.