ప్రత్యేకం : రికార్డు రేటుకు ఎన్.టి.ఆర్ తో ఒప్పందం కుదుర్చుకున్న కే.ఎస్.రామ రావు

ప్రఖ్యాత నిర్మాత కే.ఎస్.రామ రావు తాజాగా యంగ్ టైగర్ ఎన్.టి.ఆర్. తో బ్రహ్మాండమైన భారీ రేటుకు ఒప్పందం కుదుర్చుకున్నారు. ప్రస్తుతం ఆయన కొడుకు వల్లభ నిర్మిస్తున్న చిత్రం లో ఎన్.టి.ఆర్ హీరో గా నటిస్తున్న సంగతి తెలిసిందే. ఈ చిత్రం లో ఎన్.టి.ఆర్. నటన చూసిన ముగ్ధుడైన కే.ఎస్.రామ రావు, మళ్లీ ఎన్. టి. ఆర్. డెట్లు అక్షరాల 12 కోట్ల రూపాయలకు తీసుకున్నారు అని తెలుస్తోంది. ప్రస్తుతం తెలుగు చిత్ర పరిశ్రమ లో ఒక హీరో కు ఇచ్చిన పారితోషికం లో ఇదే అత్యంత భారీ రేటు. గతం లో ఇటువంటి రేట్లు చర్చలోకి వచ్చినప్పటికీ, ఇంత భారీ స్థాయి లో ఒప్పందం జరగటం ఇదే ప్రధమం.

శ్రీను వైట్ల చిత్రం తరువాత కాలం లో డెట్లు తీసుకున్నట్లు గా తెలుస్తోంది. ఎన్.టి.ఆర్. కు బ్రహ్మాండమైన స్టార్ ఇమేజ్ ఉంది అనటానికి ఈ సరికొత్త పరిణామం ఒక ఉదాహరణ.

Exit mobile version