ఇషా చావ్లా కన్నడ పరిశ్రమ లో కి ప్రవేశించడానికి సకలం సిద్దమయ్యింది . కన్నడం లో దర్శన్ సరసన “విరాట్” అనే చిత్రంలో ఒకానొక ప్రధాన పాత్ర చెయ్యబోతుంది. ప్రస్తుతం బాల కృష్ణ సరసన “శ్రీమన్నారాయణ” చిత్రం లో నటిస్తున్న ఈ భామ గత సంవత్సరం “ప్రేమ కావాలి” చిత్రం తో తెరకు పరిచయమయ్యింది. “పూల రంగడు” చిత్రం విజయవంతం కావడం తో 2012 సంవత్సరం విజయం తో మొదలు పెట్టింది. స్వతహా గా ఢిల్లీ భామ అయిన ఇషా చాలా తొందరగా అన్ని భాషల్లో పేరు తెచ్చుకోవాలని ప్రయత్నిస్తుంది. త్వరలో ఈ భామ “తను వెడ్స్ మను” రిమేక్ లో కూడా కనిపించబోతుంది.