సమంతా తీవ్రమైన ఒత్తిడి నుంచి బయటపడతారా?

అందాల నటి సమంతా తీవ్రమైన ఒత్తిడికి గురయ్యారా? ఈ తాజా వార్తను అవుననే అంటున్నాయి ఫిల్మ్ నగర్ వర్గాలు. ఎప్పుడైతే తన అనారోగ్య సమస్యలవల్ల శంకర్ – విక్రమ్ కాంభినేషన్లో రాబోయే చిత్రం నుంచి తప్పుకున్నారనే వార్తలు వచ్చాయో అప్పటినుంచి ఇలా అంటున్నారు. ప్రస్తుతం సమంతా సౌత్ ఇండియన్ చలన చిత్ర రంగంలో అగ్ర కథానాయికగా వెలుగొందుతున్నారు, ప్రస్తుతం ఆమె చేతిలో భారీ బడ్జెట్ చిత్రాలు చాలానే ఉన్నాయి. ఏ మాత్రం తీరిక లేకుండా ఇలాంటి భారీ బడ్జెట్ చిత్రాలకు పనిచేసేటప్పుడు ఒక కథానాయిక తన అన్ని చిత్రాల షెడ్యూల్స్ ని సర్దుబాటు చేసుకొనే విషయంలో తీవ్ర ఒత్తిడికి గురవుతారు.

ఇలా తీవ్ర ఒత్తిడికి గురైనప్పుడు చర్మానికి సంభందించిన వ్యాదులు మరియు అధికంగా బరువు పెరిగిపోవడం లాంటి సమస్యలు వచ్చే అవకాశాలున్నాయని, అందుకనే డాక్టర్లు తొందరగా కోలుకోవాలంటే సమంతాని కొన్ని రోజులు విశ్రాంతి తీసుకోమని చెప్పారని సమాచారం. ప్రస్తుతం చాలా భారీ బడ్జెట్ చిత్రాల్లో నటిస్తున్న ఈ భామ త్వరగా కోలుకొని ఒక సూపర్ హిట్ సినిమాతో మన ముందుకు వస్తారని ఆశిద్దాం.

సమంతా మీరు తొందరగా కోలుకోవాలని మేమంతా కోరుకొంటున్నాము.

Exit mobile version