జులాయి చిత్ర బృందంతో కలిసిన ఇలియానా

జులాయి చిత్ర బృందంతో కలిసిన ఇలియానా

Published on Apr 27, 2012 3:20 AM IST

దుబాయ్ మరియు తెలుగు చిత్ర పరిస్రమది విడదీయలేని బంధంగా అనిపిస్తుంది. పలు చిత్రాలు ఇక్కడ చిత్రీకరణ జరుపుకున్నాయి ఇప్పుడు వాటిలోకి “జులాయి” చిత్రం కూడా చేరింది. స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ మరియు ఇలియానా ప్రధాన పాత్రలలో నటిస్తున్న ఈ చిత్రానికి త్రివిక్రమ్ దర్శకత్వం వహిస్తున్నారు గతంలో మేము చెప్పినట్లుగానే 27 నుండి ఒక పాట చిత్రీకరణ జరుపుకోనుంది. ఈ రోజు ఇలియానా చిత్ర బృందంతో దుబాయ్ లో లో కలిసింది. ఈరోజు ముంబై నుండి ఈ భామ బయలుదేరింది రేపటి నుండి రెగ్యులర్ షూటింగ్ మొదలు కానుంది. డి వివి దానయ్య సమర్పిస్తున్న ఈ చిత్రాన్ని రాధా కృష్ణ నిర్మిస్తున్నారు . దేవి శ్రీ ప్రసాద్ సంగీతం అందిస్తుండగా రాజేంద్ర ప్రసాద్ ఈ చిత్రం లో ఒక కీలక పాత్ర పోషిస్తున్నారు . ఈ చిత్రం మే చివరి వారం లో కాని జూన్ మొదటి వారం లో కాని విడుదల అయ్యే అవకాశాలున్నయ్యి .

సంబంధిత సమాచారం

తాజా వార్తలు