వెంకితో కలిసి నేను మల్టీస్టారర్ చేస్తాను : రానా

వెంకితో కలిసి నేను మల్టీస్టారర్ చేస్తాను : రానా

Published on Mar 14, 2012 5:34 PM IST

యంగ్ హీరో రానా తన బాబాయ్ వెంకటేష్ తో కలిసి మల్టీస్టారర్ చిత్రం ఖచ్చితంగా చేస్తాను అని చెప్పారు. కాని ఆ చిత్రానికి అన్ని కుదరాలి అని కూడా చెప్పారు. “నేను, బాబాయ్ లేక ఎవరయినా ఇద్దరు పెద్ద హీరోలు కలిసి తెర మీద కనపడేప్పుడు చిత్రం మీద అంచనాలు భారీగా ఉంటాయి వాటి ని అందుకోవాలంటే అన్ని సరిగ్గా కుదరాలి” అని రానా చెప్పారు. త్వరలో రానా రొమాంటిక్ ఎంటర్ టైనర్ “నా ఇష్టం” చిత్రం తో తెర మీద కనపడబోతున్నారు. ఈ చిత్రం మార్చ్ 23న విడుదల కానుంది ఈ వేసవి లో “డిపార్ట్మెంట్” చిత్రం విడుదల కాబోతుంది

తాజా వార్తలు