నేను చాలా కో-ఆపరేటివ్ : తాప్సీ

తాప్సీ మన పరిశ్రమ లో మంచి కథానాయిక ఇప్పటి వరకు చెప్పుకోదగ్గ విజయాలేవి సొంతం చేసుకోకపోయినా ఈ భామ ప్రస్తుతం రవితేజ తో “దరువు” మరియు లక్ష్మి మంచు తో కలిసి “గుండెల్లో గోదారి” చిత్రాలలో నటిస్తుంది. ఈ రెండు చిత్రాల గురించి తాప్సీ చాలా నమ్మకంగా ఉంది. “ఈ రెండు చిత్రాలలో తన పాత్ర చాల బాగుంటుంది అని ఈ రెండు చిత్రాలు తనకి గుర్తింపు తెచ్చి పెడుతుంది” అని తాప్సీ అన్నారు. ప్రచార విషయం లో తన పాత్ర గురించి అడుగగా ” ప్రచార విషయం లో నేను చాలా కో- ఆపరేటివ్ గా ఉంటాను ఎందుకంటే ఒక చిత్రం లో నటించాక ఆ చిత్ర ప్రచారం లో పాల్గొనటం వారి భాద్యత ప్రస్తుతం చిత్ర విజయానికి ప్రచారమే ముఖ్యం ఈ విషయం లో నటుల సహకారం ఉంటె దర్శకులు మరియు నిర్మాతలు సంతోషిస్తారు” అని అన్నారు. ఇలా కో ఆపరేషన్ ఇస్తే తను చాలా పరిశ్రమ లో ఎదుగుతుంది.

Exit mobile version