అక్కినేని జాతీయ అవార్డు ని అందుకోబోతున్న హేమా మాలిని

ప్రపంచ ప్ర్యఖ్యాతి చెందిన బాలివుడ్ నటి హేమ మాలిని అక్కినేని జాతీయ అవార్డు ని ఎన్ కన్వెన్షన్ సెంటర్ లో జరిగిన ఉత్సవం లో అందుకున్నారు . కేంద్ర రైల్వే మంత్రి దినేష్ త్రివేది ముఖ్య అతిధి గా పాల్గొన్నారు. ఈ ఉత్సవానికి సిని ప్రముఖులు అందరు హాజరయ్యారు.

తెలుగు చిత్ర నటుడు అక్కినేని గారి పేరు మీద అవార్డు ని అందుకోటం చాలా ఆనందంగా ఉందని. ఇలా కుటుంబ సభ్యులు మొత్తం అటు చిత్ర పరిశ్రమకు మరియు సాంఘీక సేవలు చెయ్యటం చాల ఆనందదాయకమయిన విషయం. సుబ్బి రామి రెడ్డి గారు కలకు అందించే సహకారం గొప్పది అని తనతో వ్యక్తిగతంగా చాల రోజుల నుండి పరిచయం ఉందని. మా అమ్మ నాకు గొప్పతనాన్ని మలుచుకోటం అలవాటు చేసింది. నా గత రోజులను ఆహ్వానించిన ప్రతి ఒక్కరికి నా కృతజ్ఞతలు అని. నా అభిమానులు చూపించిన ప్రేమ వర్ణనాతీతం అని ఈ అవార్డు ని చాల సంతోషంగా ఆహ్వానిస్తున్నా అని హేమ మాలిని చెప్పారు.

వెంకట్ అక్కినేని మాట్లాడుతూ ” ఈ ఉత్సవం కోసం కొంత కాలాన్ని కేటాయించిన మంత్రి త్రివేది గారికి కృతజ్ఞతలు. చిన్నపుడు చాలా చిత్రాలు చూసాను కాని “జాని మేరా నాం” చిత్రం లో హేమ మాలిని నటన గుర్తుండిపోయింది. ఈ అవార్డు ప్రదానానికి హేమ మాలిని రావటం చాలా ఆనందంగా ఉందని” అన్నారు.

అక్కినేని నాగేశ్వర రావు గారు మాట్లాడుతూ ” మన ముఖ్య అతిధికి ముఖ్యమయిన మీటింగ్ వుండటం వల్ల వెళ్ళిపోవాల్సి వస్తుంది. ఈ కార్యక్రమం విషయానికి వస్తే సుబ్బిరామిరెడ్డి గారు నా సన్నిహితుడు శత్రువుల మీద ఉన్న కోపాన్ని దాచుకోగల వ్యక్తి. కమిటి హేమ మాలిని ని అవార్డు కోసం ఎన్నుకోడం చాలా ఆనందంగా ఉంది. తను చాలా మంది యువత కు “డ్రీం గల్” . తను అద్బుతమయిన భరతనాట్య నృత్య కారిణి. తనకి భారత దేశ సంస్కృతి పట్ల ఉన్న సంఘీభావం చూస్తుంటే చాలా ఆనందంగా ఉంది. నా పేరు మీద అవార్డు ఇవ్వటం చాలా ఆనందం కలిగిస్తుంది కాస్త గర్వంగా కూడా ఉంది.

అంతర్జాతీయ ఫిలిం స్కూల్ గురించి మాట్లాడుతూ నేను 60 లో వున్నప్పుడు అమెరికా వెళ్ళాను అక్కడ ఫిలిం స్కూల్స్ చూసి చాలా ఆశ్చర్యపోయాను అవి నన్ను బాగా ఆకట్టుకున్నాయి. ఇప్పుడు నా కుటుంబసభ్యులు నా కలను నిజం చేస్తున్నారు.

సుబ్బిరామి రెడ్డి మాట్లాడుతూ ” ఏ ఎన్ ఆర్ ఒక అద్బుతమయిన నటుడని అయన ఈ అవార్డు కోసం ఒక కోటి రూపాయలు బ్యాంకు లో డిపాజిట్ చేశారని. హేమ మాలిని చాలా అందంగా ఉండటమే కాకుండా అద్బుతంగా నటిస్తుందని చెప్పారు. ఈ అవార్డ్ ను చాలా కాలం పాటు ఇవ్వాలని. హేమ మాలిని హైదరాబాద్ కు రావటం చాలా ఆనందకరమయిన విషయం అని” చెప్పారు.

దినేష్ త్రివేది మాట్లాడుతూ ” హేమమాలిని కి అవార్డు ప్రధానం చెయ్యటం చాలా సంతోషకరంగా ఉందని తన చిత్రాలు తెర మీద చూస్తున్నపుడు ఎప్పుడు ఇలా తనతో వేదిక పంచుకుంటా అని అనుకోలేదు. తను అద్బుతమయిన ప్రతిభావంతురాలు “జాని మేరా నాం” నుండి “బాగిబన్” చిత్రం వరకు తన ప్రయాణం అద్బుతం. అక్కేనేని నాగేశ్వర రావు అవార్డు కన్నా పెద్ద అవార్డు లేదని హేమ మాలిని లాంటి ప్రతిభావంతురాలికి ఈ అవార్డు చెందాలి అని అన్నారు. మన పరిశ్రమ హాలివుడ్ కన్నా మంచి సినిమాలు తీయగలరు. ఆ వైపుగా నమ్మకం ఉంచి కృషి చెయ్యాలని అన్నారు.

Exit mobile version