షూటింగ్ మొదలయిన “గుండెల్లో గోదారి”

లక్ష్మి మంచు నూతన చిత్రం “గుండెల్లో గోదారి” జనవరి 1 న రాజమండ్రి లో మొదలయ్యింది. ఆది పినిసెట్టి, లక్ష్మి మంచు ,తాప్సీ మరియు సందీప్ కిషన్ ఈ చిత్రం లో ప్రధాన పాత్రలు పోషిస్తున్నారు.ఈ చిత్రం లో నటనతో కూడిన ప్రేమకథ ఉంటుంది 1986 లో వచ్చిన వరదల ఆధారంగా తీస్తున్న చిత్రం లో చాలా భాగం తూర్పు మరియు పశ్చిమ గోదారి జిల్లాల లో ఉంటుంది. కుమార్ నాగేంద్ర దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రానికి పళణి ఛాయాగ్రాహకుడిగా చేస్తున్నారు. ఇళయరాజా సంగీతం అందిస్తున్నారు. జనవరి 7 న మొదటి షెడ్యూల్ పూర్తి చేసుకోనుంది ఈ సంవత్సరం మే లో ఈ చిత్రం విడుదల కావచ్చు.

Exit mobile version