పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ నటిస్తున్న ‘గబ్బర్ సింగ్’ మొదటి టీజర్ వీడియో ఫిబ్రవరి 23 న విడుదల చేయనున్నారు. ఈ చిత్ర నిర్మాత అయిన బండ్ల గణేష్ బాబు మహా శివరాత్రికి విడుదల చేయాలని భావించారు. తాజా సమాచారం ప్రకారం ఆ నిర్ణయాన్ని వాయిదా వేసుకున్నారు. హరీష్ శంకర్ డైరెక్ట్ చేస్తున్న ఈ చిత్రంలో శృతి హాసన్ హీరొయిన్ గా నటిస్తుంది. హిందీలో వచ్చిన ‘ధబాంగ్’ చిత్రానికి రీమేక్ గా తెరకెక్కుతున్న విషయం తెలిసిందే. హరీష్ శంకర్ ఈ టీజర్ కొద్ది మంది ఇండస్ట్రీ ప్రముఖులకు చూపించగా వారు అధ్బుతంగా వచ్చిందని చెబుతున్నారు. దేవి శ్రీ ప్రసాద్ సంగీతం అందించిన ఈ చిత్రాన్ని ఏప్రిల్ చివరి వారంలో విడుదల చేయడానికి సన్నాహాలు చేస్తున్నారు.