పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ‘గబ్బర్ సింగ్’ చిత్రంలో నటిస్తున్న విషయం అందరికీ తెలిసిందే. ఈ చిత్రానికి సంభందించిన మొదటి టీజర్ 23 న విడుదల చేయగా అధ్బుతమైన స్పందన వచ్చింది. టీజర్ విడుదలైన ఒక్క రోజులోనే 4 లక్షల 30 వేల హిట్స్ పడ్డాయి. దీనిని బట్టి చెప్పొచ్చు పవన్ కళ్యాణ్ క్రేజ్ ఏ మాత్రం ఉందొ.హరీష్ శంకర్ దర్శకత్వం వహించిన ఈ చిత్రం ‘దబాంగ్’ రిమేక్ అన్న విషయం మనకు తెలిసిందే. పరమేశ్వర ఆర్ట్స్ బ్యానర్ పై బండ్ల గణేష్ బాబు నిర్మిస్తున్న ఈ చిత్రానికి దేవి శ్రీ ప్రసాద్ సంగీతం అందించాడు. శృతి హసన్ హీరొయిన్ గా నటిస్తున్న గబ్బర్ సింగ్ చిత్రం ఏప్రిల్లో విడుదలకు సన్నాహాలు చేస్తున్నారు.
గబ్బర్ సింగ్ టీజర్ కోసం ఇక్కడ క్లిక్ చేయండి – వీడియో లింక్