పాత్ర వైఖరి మీదే నడిచే “గబ్బర్ సింగ్”

“దబాంగ్” విడుదలయిన మొదట్లో విమర్శకులు రొటీన్ చిత్రమని తీసి పారేశారు కాని అందులో సల్మాన్ నటన మరియు అతని పాత్ర నడిచే ధోరణి అందరిని ఆకట్టుకుంది. పోలీసు పాత్ర లో ఉన్న పవిత్రత ను చూపుతూ కొన్ని సమయాలలో నిజాయితీకి విరుద్దంగా నడిచే పాత్రలో కనిపించారు. ఇలాంటి పాత్రలో పవన్ కళ్యాణ్ సరిగ్గా సరిపోతారు.ఇలాంటి హాస్యబరితమయిన పాత్రలో పవన్ బాగా హాస్యాన్ని పండిస్తారు . సల్మాన్ లాగా కండలు తిరగకపోయినా హాస్య చతురత బాగానే పండిస్తారు. చిత్రం లో పదునయిన డైలాగు లు కూడా ఉండబోతున్నాయి ఇలాంటివి పవన్ కళ్యాణ్ అద్బుతంగా చెప్తారు. ఈ విషయాలే పవన్ కి “గబ్బర్ సింగ్ ” చిత్రం కీలకంయ్యేలా చేసింది. ఈ సారి పవన్ తన అభిమానులను నిరశాపరచాడనే అనిపిస్తుంది.

Exit mobile version