యంగ్ టైగర్ నటిస్తున్న దమ్ము చిత్రానికి సంభందించిన ప్రత్యేక సమాచారం మాకు లభించింది. ఈ చిత్ర దర్శకుడు బోయపాటి శ్రీనివాస్ తో ముచ్చటించడం జరిగింది. దమ్ము చిత్రానికి కొన్ని ముచ్చట్లు ఆయన చెప్పారు. దమ్ము ఫైనల్ కాపీ సిద్ధమయిందని, రేపు సెన్సార్ జరగనుంది. ఈ సినిమాలో ప్రతి సన్నివేశం ప్రత్యేక జాగ్రత్త తీసుకుని తీర్చిదిద్దారు. ఈ నెల 20న దంముకి సంభందించిన కొన్ని ట్రైలర్స్ విడుదల చేయనున్నారు. వీటితో పాటుగా కొన్ని స్టిల్స్, పోస్టర్ కూడా విడుదల చేయనున్నారు. ఏప్రిల్ 27న విడుదల కాబోతున్న ఈ చిత్రంలో ఎన్టీఆర్ సరసన త్రిషా మరియు కార్తీక హీరోయిన్స్ గా నటిస్తున్నారు. కీరవాణి సంగీతం అందిస్తున్న ఈ చిత్రాన్ని వల్లభ నిర్మిస్తున్నారు.