విడుదల కు ముందే 40 కోట్ల బిజినెస్ చేసిన “దమ్ము”

విడుదల కు ముందే 40 కోట్ల బిజినెస్ చేసిన “దమ్ము”

Published on Mar 1, 2012 6:11 PM IST

యంగ్ టైగర్ ఎన్ టి ఆర్ నటిస్తున్న “దమ్ము” ఈ వేసవి బ్లాక్ బస్టర్ అవుతుందని అన్ని సూచనలు కనిపిస్తున్నాయి ఈ చిత్రం విడుదలకు ముందే భారిగా బిజినెస్ చేస్తుంది. మా వద్ద ఉన్న సమాచారం ప్రకారం ఈ చిత్రం ఇప్పటికే 40 కోట్ల బిజినెస్ చేసింది. ఉత్తరాంధ్ర హక్కులను 3.45 కోట్లకు అమ్ముడుపోయింది గుంటూరు,కృష్ణ మరియు నెల్లూరు హక్కులను బెకరి ప్రసాద్ 7.2 కోట్లకు సొంతం చేసుకున్నారు. దిల్ రాజు మరియు కుబెరాన్ పిక్చర్స్ సీడెడ్ మరియు నిజాం హక్కులను 11 కోట్లకు సొంతం చేసుకున్నారు ఉభయ గోదావరి జిల్లాలు , ఓవర్సీస్, సాటి లైట్ హక్కులు,ఆడియో హక్కులు ఇండియా విదే విడుదల ఇలా అన్ని కలిపి బిజినెస్ 40 కోట్లు దాకా చేరుకుంది. బోయపాటి శ్రీను మరియు ఎన్ టి ఆర్ కలయిక ఈ చిత్రం మీద ఇన్ని అంచనాలకు దారి తీసింది. అన్ని సరిగ్గా కుదిరితే ఈ చిత్రం బ్లాక్ బస్టర్ అవుతుంది.

తాజా వార్తలు